STC ‘తెలుగు భాషా దినోత్సవం’ – 2020

‘స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ’ (STC) ఆధ్వర్యంలో శనివారం తెలుగు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ‘తెలుగు భాషా దినోత్సవం’, స్వీడన్ రాజధాని స్టాక్ హోం లో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ‘స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ’ చైర్మన్ ‘సురేంద్ర అలుగునూల’ మాట్లాడుతూ తోటి తెలుగు వారితో మరియు పిల్లలతో కలిసి స్వీడన్ లో మొదటిసారి గా జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ సంప్రదాయం ఇలానే కొనసాగించి, పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తిని రేకేత్తిచ్చే విధంగా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరుపుకుందామని అన్నారు. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలని కోరారు. 

ఈ సందర్భంగా పిల్లలకు తెలుగు ‘చదవడం’, ‘వ్రాయడం’, ‘వినడం’, ‘కథాకథనం”, ‘తెలుగులో క్విజ్’, ‘పద్యాలు’ మరియు ‘గేయాలు’ వంటి పోటీ కార్యక్రమాలు ‘ప్రాథమిక’ మరియు ‘మధ్యమ’ స్థాయిలో జరపడం జరిగింది. ఈ పోటీ కార్యక్రమాలలో ఐదు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలు ఉత్సాహంగా పాలొన్నారు. విజేతలకు కార్యక్రమం చివరలో బహుమతులు మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ’ బోర్డు మెంబర్లు ప్రవీణ్ రంగినేని, గంగాధర్ నీరడి, నిరంజన్ కోమాండ్ల మరియు రమ పాలడుగు గార్లు పాలొన్నారు. పోటీ కార్యక్రమ నిర్వహణలో STC ‘తెలుగు భాషా కమిటీ’ తరుపున  దీపికా గూడ, రమేష్ దేసు మరియు ప్రత్యూష భూపతి గార్లు సహకరించారు.  

ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు సంతోష్ అల్లాడి, సుజాత నామాల, జ్యోతి కవుల, నీరజ కస్తూరి, సాధన పూసపాటి, జగదీశ్ నల్ల, అనూష మానేరు మరియు  ఉష శ్రీ చాగంటి గార్లు హాజరై కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

తెలుగు పోటీల విజేతలు వివరాలు….
https://swedentelugucommunity.com/wp-content/uploads/2020/08/Winners.jpg

Gallery