Date: 2019-11-09
ఈ రోజు రోక్ స్థా, స్టాక్ హోం లో ‘స్వీడన్ తెలుగు బడి – సన్నాహక సమావేశం’ జరిగింది. హాజరైన సభ్యులందరికి కృతజ్ఞతలు!
హాజరయిన సభ్యులు: సురేంద్ర అలుగునూళ్ల, నిరంజన్ కోమాండ్ల, ప్రవీణ్ రంగినేని, గంగాధర్ నీరడి, ప్రియ వంకా, కిషోర్ వడ్లపట్ల, శ్రీకాంత్ సంగరాజు, భారతి దేసు, రమేష్ దేసు మరియు ముదాసిర్ మొహమ్మద్
సమావేశంలో దిగువ అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎజెండా మరియు చర్చాంశంల పూర్తి వివరాల కొరకు ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్’ జతపరచడం జరిగింది.
• ‘స్వీడన్ తెలుగు బడి’ ఉద్దేశ్యం
• తల్లిదండ్రుల స్పందన – తరగతుల నిర్వహణ
• సిలబస్ మరియు సర్టిఫికెట్
• మాతృభాష దినోత్సవం – తెలుగు
• ఎస్ టి సి భాష కమిటీ – అనుబంధ కమిటీలు
• తదుపరి కార్యాచరణ
తీర్మానాలు:
• ‘స్వీడన్ తెలుగు బడి’ ఉద్దేశం ఆమోదించి, దీనిని ముందుకు తీసుకుని విధంగా ప్రయత్నించాలి.
• ‘తెలుగు భాషా కమిటీ’ (STC Literature Committee) ఉద్దేశం దిగువ సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి ఉన్న మరికొందరిని గుర్తించి విస్తరించాలి.
– నిరంజన్ కోమాండ్ల
– ప్రవీణ్ రంగినేని
– గంగాధర్ నీరడి
– కిషోర్ వడ్లపట్ల
– శ్రీకాంత్ సంగరాజు
• తల్లిదండ్రుల విశ్వాసం పొందడానికి మరియు పిల్లలకు తెలుగు పైన ఆసక్తి కలిగే విధంగా ‘తెలుగు భాషా కమిటీ’ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలి.
• వివిధ దేశాలు, ప్రాంతాలలో ఉన్న తెలుగు శిక్షణా సంస్థలను పరీక్షించి మరియు సంప్రదించి, వివిధ స్థాయిలలో సిలబస్ తయారుచేయాలి.
• తరగతుల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు మరియు ఉపాధ్యాయులను గుర్తించి జనవరి 2020 లో ప్రారంభించాలి.
• ఆసక్తి మరియు సదుపాయాల అందుబాటును బట్టి, మొదటగా ఏ స్థాయిలో మరియు ఎక్కడ ప్రారంభించాలి అనేది ‘తెలుగు భాషా కమిటీ’ ఒక నిర్ణయం తీసుకోవాలి.
• అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు భాషపై పిల్లలకు ఆసక్తి రేపే విధంగా పోటీలు నిర్వహించడం (వీలయితే పెద్దలకు కూడా).
ఇట్లు
తెలుగు భాషా కమిటీ,
స్వీడన్ తెలుగు కమ్మ్యూనిటీ.